Game changer: టికెట్ రేట్ల పెంపు..తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..! 13 h ago
గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతిచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్లో రూ. 100, మల్టీ ప్లెక్సులో రూ. 150 అదనంగా పెంచేందుకు, జనవరి 11-19 వరకు 5 షోలకి సింగిల్ స్క్రీన్లో రూ. 50, మల్టీ ప్లెక్సులో రూ. 100 పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అర్ధరాత్రి 1 గంట బెన్ఫిట్ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది.